కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ ఘాటు సెటైర్..!

కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనపై బీఆర్ఎస్ నాయకత్వం ఎక్స్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలు పోస్ట్ చేస్తూ "ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే" అంటూ వ్యంగ్య ట్వీట్ చేసింది.

కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ ఘాటు సెటైర్..!

కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనపై బీఆర్ఎస్ నాయకత్వం ఎక్స్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలు పోస్ట్ చేస్తూ “ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే” అంటూ వ్యంగ్య ట్వీట్ చేసింది.

తలా తోక ఎప్పటికీ ఒక్కటే: కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి

కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. కవితక్క కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)..బీఆర్ఎస్ కు తోక పార్టీగా అభివర్ణించారు. తలా తోక ఎప్పటికీ ఒక్కటేనని, బాపు BRS అంతర్భాగమే తనయ TRS అని సెటైర్లు వేశారు.

కేసీఆర్ పై కవిత సంచలన విమర్శలు

అంతకుముందు టీఆర్ఎస్ కొత్త పార్టీ ప్రకటన సందర్బంగా కేసీఆర్ పై సంచలన విమర్శలు చేసింది. పార్టీలో అమ్మతనం, మమకారం పోయిందని ఆరోపించింది. ఆనాటి కేసీఆర్ వేరు… ఈనాటి కేసీఆర్ వేరు అని, హైడ్రా‌లో ఇళ్లు కూలిపోతుంటే వచ్చారా? రైతుల కష్టాలపైన, చేనేత కార్మికులపైన ఇప్పుడు ఆ సార్..రారు..ఆయన మారిన మనిషి… మర మనిషి అని.. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్‌ బందీ అయ్యారని విరుచుకుపడ్డారు. ఇసుక దందా కోసం కేటీఆర్ దళితులను చంపిండు,ఇసుక మీద ప్రేమతో దళితులను కొట్టించిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు బాగుపడుతవి అనుకున్నాం కానీ మన రాష్ట్రంలో మన రైతులకు కేసీఆర్ బేడీలు వేసిండు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫామ్‌హౌస్‌లో పెద్ద సార్ ఉండాలే..చిన్న సార్ సీఎం కావాలే.. ఇదే బీఆర్ఎష్ సిద్దాంతం అని కవిత మండిపడ్డారు. అవినీతి పందికొక్కులను మాత్రం కేసీఆర్‌ పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం మొదలుపెట్టా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ’’ అంటూ కవిత ప్రసంగించారు.

సీఎం రేవంత్‌పైన నిప్పులు

ఇప్పుడు ఉన్న సీఎం కర్కోటకుడిలా వ్యహరిస్తున్నాడని రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్ అయ్యారు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు. కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే అలా అనాల్సి వస్తోంది అంటూ సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి :

RTC Strike | 12 గంట‌ల చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు
కవిత పాంచజన్యం.. ఐదు హామీలు ఇవే!