కవిత పాంచజన్యం.. ఐదు హామీలు ఇవే!

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత పార్టీ ఎజెండాను పాంచజన్యం పేరుతో ప్రకటించారు.

కవిత పాంచజన్యం.. ఐదు హామీలు ఇవే!

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత పార్టీ ఎజెండాను పాంచజన్యం పేరుతో ప్రకటించారు. 1). అందరికీ ఉచిత విద్య, 2). అందరికీ ఉచిత వైద్యం, 3). రైతే రాజు – ఉచిత విద్యుత్‌, 4). యువతకు ఉద్యోగం, ఉపాధి, తొలి ఏడాదే 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, రూ.20 కోట్ల వరకు రుణాలు, 5). సామాజిక న్యాయం పేరుతో ఐదు అంశాల ఎజెండాను కవిత ప్రకటించారు. ఈ ఐదు అంశాలపై పోరాటం చెద్దామని, అధికారంలోకి వచ్చాక ప్రజలకు వాటిని అందిద్దామని పేర్కొన్నారు.

నేను తెలంగాణ మూడున్నరకోట్ల ప్రజల అమ్మగా తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి అమ్మగా పరిణతి చెందాలని అనుకుంటున్నానని, బిడ్డలకు కష్టాలు వస్తే అమ్మ హృదయం బద్దలవుతుందన్నారు. అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే ప్రజల కష్టాలు తీరతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోవడం వల్లే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది అని, అమ్మగా పాంచజన్యం హామీలలో భాగంగా తెలంగాణ బిడ్డలకు ఉచిత విద్యను అందిస్తానన్నారు. ప్రైవేటులో చదివినా డాక్టర్, ఇంజనీర్, రాకెట్ సైంటిస్టయినా నేను ఉచిత విద్య అందిస్తానని తెలిపారు.

రెండో హామీగా అమ్మ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలందరికి ఏ వ్యాధికైనా..ఎంతపైద్దదైనా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తానని ప్రకటించారు. ఇక రైతే రాజు నినాదంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, రైతులకు 24గంటల పగటిఉచిత విద్యుత్తు,యూరియా, విత్తనాలు వంటివి అన్ని అందిస్తామన్నారు. మూడో హామీగా అమ్మ ప్రభుత్వంలో 2లక్షల నుంచి 20కోట్ల వరకరు కూడా యువతకు ఉపాధి రుణాలు అందిస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగం, ఉపాధి, తొలి ఏడాదే 4 లక్షల ఉద్యోగాలను సింగిల్ నోటిఫికేషన్ తో ఇస్తామని, ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. వీటన్నింటిపై అధ్యయనం చేసి ప్రకటిస్తున్నానన్నారు.

పాంచజన్యంలో ఐదో హామీ సామాజిక న్యాయం కోసం సామాజిక తెలంగాణ సాధించాల్సి ఉందని, ఇందుకోసం టీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల కోసం, మహిళ రిజర్వేషన్ల కోసం పోరాడుతుందని, అధికారంలోకి వచ్చాక అమలు చేస్తుందని కవిత ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

అజారుద్దీన్, కోదండరామ్ ల ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం
Chiranjeevi | 15 లక్షల వ‌ల్ల‌ ‘బాషా’ను మిస్ చేసుకున్న చిరంజీవి .. చేసి ఉంటే టాలీవుడ్ చరిత్ర మారిపోయేదా?