Kavitha new party| మరో 20 రోజుల్లో కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం: కవిత

తెలంగాణలో మరో 20రోజుల్లో ప్రత్యామ్నాయ కొత్త రాజకీయ, ప్రజాశక్తిగా రాబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల పక్షాన మేం తీర్మానం చేసిన అంశాలకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే పార్టీగా మారిన వెంటనే బావి బాట పడుతాం అని, సమ్మెకు కూడా వెనుకాడబోమని పేర్కొన్నారు. మాతో, సింగరేణితో పెట్టుకోవద్దు అని హెచ్చరించారు.

Kavitha new party| మరో 20 రోజుల్లో కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం: కవిత

విధాత : తెలంగాణలో మరో 20రోజుల్లో ప్రత్యామ్నాయ కొత్త రాజకీయ, ప్రజాశక్తిగా రాబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త తరహా రాజకీయం, ప్రజల పక్షన నిలబడే రాజకీయం, ప్రజల మంచికోసం పనిచేసే నాయకులు ఎట్లా ఉంటారో చూపించే విధంగా మేం ప్రజల ముందుకు రాబోతున్నామన్నారు. సింగరేణి తెలంగాణకు ప్రాణప్రదమైందని, దాని పరిరక్షణకు ఉద్యమిస్తాం అన్నారు. ఉద్యమ కాలంలో 40రోజులు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు మేం 4రోజులు చేస్తేనే మీకు చుక్కలు కనబడుతాయన్నారు. అందుకే మేం తీర్మానం చేసిన అంశాలకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే పార్టీగా మారిన వెంటనే బావి బాట పడుతాం అని, సమ్మెకు కూడా వెనుకాడబోమని పేర్కొన్నారు.
మాతో, సింగరేణితో పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. త్వరిత గతిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారని, కార్మికుల నియామకాలపై కాదు మీ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అని కవిత ప్రశ్నించారు. కార్మికులకు సొంత ఇల్లు పథకం, ఇన్ కామ్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన సింగరేణికి… బొగ్గు, కరెంట్ బకాయిలు కలిపి ఈ ప్రభుత్వం 47 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, వాటిని చెల్లించకపోవటంతో కార్మికుల సేప్టీకి, వారి జీతాలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ తో సోలార్ ఒప్పందం ఎందుకు? అని ప్రశ్నించారు. లిథియం బ్యాటరీల తయారీ పేరుతో 25 లక్షల విలువలేని ఆల్ట్ మిన్ అనే కంపెనీ లో సింగరేణి సంస్థ ఏ విధంగా 2250 కోట్ల పెట్టుబడి పెడుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.