కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మా మద్దతు : కవిత

కేరళ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 07, 2026, 3:54 pm IST
Read Time: 3 mins
కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మా మద్దతు : కవిత

విధాత, హైదరాబాద్ : కేరళం అసెంబ్లీ ఎన్నికలలో మా మద్దతు సీఎం పినరయి విజయన్ సారధ్యంలోకి ఎల్డీఎఫ్(LDF) కూటమికేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలను వంచించారు అని కవిత విమర్శించారు. రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన వంటి హామీలను గాలికొదిలేశారు అన్నారు. ఇప్పుడు అదే గ్యారంటీల నాటకాన్ని కేరళలోనూ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారని కవిత విమర్శించారు.

కాంగ్రెస్ గ్యారెంటీల పట్ల కేరళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రైతు రుణ మాఫీ నుండి ఉద్యోగ కల్పన సహా రైతు సంక్షేమం వరకు ఇచ్చిన హామీలన్నీ అక్షరాలా నెరవేరకుండానే మిగిలిపోయాయి అని కవిత ఆరోపించారు. కేరళంను కాంగ్రెస్ గ్యారంటీల బాధిత రాష్ట్రంగా మారనీయవద్దని, ఆ రాష్ట్ర అభివృద్ధి పయనాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి పినరయి విజయన్ నాయకత్వమే కేరళం ప్రగతికి బాట అని కవిత స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన: హరీశ్ రావు ఫైర్
కేరళంలో వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి