కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ బందీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం పాలనలో, రెండున్నరేళ్లుగా సోనియాగాంధీ కుటుంబం చేతిలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను కుటుంబ, అవినీతి పార్టీల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.

కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ బందీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం పాలనలో, రెండున్నరేళ్లుగా సోనియాగాంధీ కుటుంబం చేతిలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను కుటుంబ, అవినీతి పార్టీల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను ఢిల్లీకి మోయడమే పనిగా పెట్టుకుందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసిందని విమర్శించారు.
తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తున్నప్పటికి కాంగ్రెస్ రాజకీయ విమర్శలతో తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.

సన్నబియానికి కేంద్రం 80% నిధులిస్తుందని, తెలంగాణలో హైవేల కోసం 1లక్ష 85 వేల కోట్లు ఇచ్చాం అని, 5 వందే భారత్ ట్రైన్లు ఇచ్చాం అని, ఆరు అమృత భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇచ్చాం అని, 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు ఇచ్చామని..ఇవన్నీ రాహుల్ ఇచ్చారా లేక కేసీఆర్ తెచ్చారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అని, కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మేము మాట తప్పం అన్నారు. అందుకే మూడుసార్లు కేంద్రంలోఅధికారంలోకి వచ్చాం అని, 21 రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు అన్నారు. గత ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచాం అని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ… సీఎంవంత్ రెడ్డిని ప్రజలు ప్రజలు మర్చిపోయారు అని, భూములు దోచుకోవడమే వారికి తెలుసు అని, డబ్బులు ఢిల్లీకి పంపడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇంతవరకు హామీలు అమలు చేయలేదు అి, తెలంగాణ అప్పుల ఉబిలో కూరుకపోయింది అన్నారు. బీజేపీ బిజెపి అధికారంలోకి వస్తేనే తెలంగాణలో సాధ్యం అన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ విమర్శించారని, అందుకే ప్రజలు ఫామ్ హౌస్ కి పరిమితం చేశారన్నారు. తెలంగాణలో బెంగాల్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ…తెలంగాణను కుటుంబ, వారసత్వ , అవినీతి పార్టీల నుంచి విముక్తి చేసి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నట్లుగా తెలిపారు.