Kishan Reddy | లీకు వీరులు.. మెంటల్ వాళ్లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన మంత్రి సమావేశం లీక్‌పై మండిపడ్డారు. లీక్ చేసిన మెంటల్ వాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Kishan Reddy | లీకు వీరులు.. మెంటల్ వాళ్లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

విధాత : ఏపీ, తెలంగాణ ఎంపీలతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశం వివరాలను లీక్ చేసిన వాళ్లు మెంట్ వాళ్లు అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీక్ పై సీరియస్ అయ్యారు. సమావేశంలో జరిగిన విషయాలు బయట చెప్పొద్దని ప్రధానమంత్రి చెప్పారని, అయినా కూడా మీటింగ్ లో జరిగిన విషయాలను బయటకి చెప్పారు అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. లీక్ వీరులను గుర్తించే పనిలో ఉన్నామని..లీక్ చేసిన ఆ మెంటల్ వాళ్లు ఎవరో తెలిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

క్లాస్ పీకారన్నది అవాస్తవం

తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ పీకారని జరిగిన ప్రచారం అవాస్తం అని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ప్రధాన మంత్రి సూచించారని, తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయమన్నారని తెలిపారు. సమావేశం లోపలి జరిగింది ఒకటైతే బయట మరొకటి ప్రచారం జరిగిందన్నారు. లీక్ లతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని..నాయకత్వంలో ఐక్యతను దెబ్బతీస్తుందని..ఇకమీదట ఇలాంటివి చేయరాదని సూచించారు. దక్షిణ భారతదేశ నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని, బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తోసమీక్ష నిర్వహించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై చర్చించామన్నారు. రూ.400 కోట్లతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్‌ రెండో దశపై చర్చించినట్లుగా తెలిపారు. కొమరవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆయనను కోరినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు.

ఓట్‌ చోరీ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను కిషన్‌రెడ్డి ఖండించారు. రాహుల్‌ అనైతికంగా మాట్లాడుతున్నారన్నారు. ఏ విషయాలు మాట్లాడాలనే దానిపై ఆయనకు అవగాహన లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్‌ ఉండటం దురదృష్టకరమని కిషన్ రెడ్డి విమర్శించారు.

జీహెచ్ఎంసీ వార్డుల విభజనలో శాస్త్రీయత లేదు.. కాంగ్రెస్ పార్టీ దానిని వ్యతిరేకిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మజ్లిస్ కు లబ్ధి చేకూర్చేలా విభజన ఉందని.. ఇది దారుస్సలాంలో జరిగిన వార్డుల విభజన అని.. కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీల నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంప్రదించకుండా చివరకు మేయర్ కు కూడా తెలియకుండా వార్డుల విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈసారి హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పక్కాగా గెలుస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి :

Havan Statue Of Liberty Collapses : స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది !

Giant Python In Drainage : డ్రైనేజీలో భారీ కొండచిలువ..వైరల్ వీడియో