Kodanda Reddy : కేంద్రం సీసీఐ ద్వారా పత్తి కొనాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

సీసీఐ పత్తి కొనుగోలు నుంచి కేంద్రం తప్పుకోవాలని చూస్తోందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులను దగా చేస్తున్నట్టుగా కోదండరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Kodanda Reddy : కేంద్రం సీసీఐ ద్వారా పత్తి కొనాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

విధాత, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలి.. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు బాధ్యత నుండి తప్పుకోడానికి నీతి ఆయోగ్ లో నిర్ణయం తీసుకుందన్నారు. ఈ దురుద్దేశం పెట్టుకొని పత్తి కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడం, కపాస్ కిసాన్ యాప్ తీసుకురావడం, ఎకరాకు 7 క్వింటాళ్లు కొనుగోలు చేయమని చెప్పడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కోదండరెడ్డి మండిపడ్డారు.

అమాయక రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని షరతు పెట్టడం అంటే రైతులను దగా చేయడమేనని ఆరోపించారు. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని కోదండరెడ్డి విమర్శించారు. వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను ప్రయివేట్ పరం చేయడానికి చేసిన పాలసీ పత్రంగా ఉందన్నారు. ఒక్కటొక్కటిగా వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేయడానికి బహుళ జాతి కంపెనీలకు అప్పజెప్పడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే ఇవ్వన్నీ ఆంక్షలు పెడ్తున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు.