కించపరిచే కథనాలు మంచిది కాదు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్

తెలంగాణ ఉద్యమకారుల గురించి అడ్డగోలుగా వార్తలు రాస్తే నువ్వు, నీ ఛానల్ తెలంగాణలో ఉండదని ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ రాధాకృష్ణకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా మీడియా మీద ఆధారపడే స్థితిలో తెలంగాణ రాజకీయ నాయకులు లేరు అని, మేము తలుచుకుంటే ఏబీఎన్ లాంటివి 100 ఛానళ్లు పెడతాం అని వ్యాఖ్యానించారు. మా కెపాసీటి ఎందో చూపిస్తే తెలంగాణలో నీ పేపర్, ఛానల్ ఉండబోదని బెదిరించే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గురించి అడ్డగోలుగా వార్తలు రాస్తే నువ్వు, నీ ఛానల్ తెలంగాణలో ఉండదని ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ రాధాకృష్ణకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా మీడియా మీద ఆధారపడే స్థితిలో తెలంగాణ రాజకీయ నాయకులు లేరు అని, మేము తలుచుకుంటే ఏబీఎన్ లాంటివి 100 ఛానళ్లు పెడతాం అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర మీడియా ఛానళ్తు తమకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

నిజమైన కాంగ్రెస్ వాదులను, ఉద్యమకారులను కించపరిచేలా పిచ్చి పిచ్చి కథనాలు ప్రచురిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మా కెపాసీటి ఎందో చూపిస్తే తెలంగాణలో నీ పేపర్, ఛానల్ ఉండబోదని బెదిరించే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

మీడియా , జర్నలిస్టులు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని.. కానీ, మీడియా ముసుగులో తమ వ్యక్తిత్వాన్ని హననం చేద్దామని చూడటం మంచిది కాదన్నారు. తాను అన్ని మీడియా సంస్థలను అనడం లేదని.. ఎవరైతే కొందరు వ్యక్తులకు మాత్రమే పనిచేస్తూ కొమ్ము కాస్తున్నారో వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నానని అన్నారు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఎంతోమంది ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

అసలైన కాంగ్రెస్ పార్టీ నేతలము తామని.. పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్రం గురించి కొట్లాడిన చరిత్ర తమదని చెప్పుకొచ్చారు. మాలాంటి వ్యక్తులను కూడా కించపరిచే విధంగా, క్యారెక్టర్లను దెబ్బతీసేలా ఆంధ్రా వార్త పత్రికలు, న్యూస్ ఛానళ్లు వార్తలు రాస్తే మర్యాదగా ఉండదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి అనునిత్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని అవినీతికి వ్యతిరేకంగా పని చేసే వ్యక్తిని  అని చెప్పుకొచ్చారు.  తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు. నా పైన విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు అంతమాత్రాన తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో తాను ఒకడినని, పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్‍కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడినని తెలిపారు. 2018 ఎన్నికల్లో పెద్ద పెద్ద లీడర్లు ఓటమి పాలైనా మునుగోడు ప్రజలు మాత్రం తనను గెలిపించారన్నారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూసిన కేసీఆర్‍కు వ్యతిరేకంగా సర్వస్వం ధారపోసి కొట్లాడిన వ్యక్తిని నేనని అలాంటి నాపై మాట్లాడే వారు ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

తెలంగాణలో నిజమైన, నిజాయితీపరులైన ఉద్యమాకారులు ఎంతో మంది ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నత స్థాయి పదవుల్లో ఉండవచ్చు. అంత మాత్రాన నిజాయితీగా ఉద్యమంలో పోరాడిన వ్యక్తులను కించపరిచేలా కథనాలు రాయవద్దని హెచ్చరించారు. మాది అసలైన కాంగ్రెస్ రక్తం అన్నారు.

వ్యక్తిగతంగా సీఎంను గానీ ఇతర నాయకులెవరినీ నేను విమర్శించలేదన్నారు. ఎన్నికలప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపైన, వారు గెలిచిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతున్న క్రమంలో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపైన, అధిష్టానంపైన ఉందని చెప్పానన్నారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నానన్నారు. పార్టీ బలోపేతం కోసమే, నా నియోజకవర్గం కోసం మాట్లాడుతాను తప్ప పార్టీని బలహీన పరిచేలా ఎప్పుడూ మాట్లాడనన్నారు. నేను ఏదైనా మాట్లాడితే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అన్నారు.

మునుగోడు అభివృద్ధి నిధుల విషమై చర్చించేందుకు భట్టి విక్రమార్కను కలిశానని,  కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని.. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని ఈ అంశంలో సీఎం మాటే నామాట అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇచ్చిందని..దీనిపై  అధిష్టానం నిర్ణయాన్ని ఎవరూ కాదనలేమన్నారు. నేను కొండా మురళితో కలిసి ప్రజాభవన్ వెళ్లలేదని, నేను వెళ్లే సరికి ఆయన అక్కడ ఉన్నారని స్పష్టం చేశారు.

 

Latest News