Komatireddy Venkat Reddy : ఆర్ఆర్ఆర్ ఇప్పట్లో అయ్యేది కాదు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు. ఇప్పట్లో రీజనల్ రింగ్ రోడ్ సాధ్యం కాదన్న వ్యాఖ్యలు వైరల్.

విధాత: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపాక రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులతో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ అయ్యేదా..? పొయ్యేదా..? ఎలాంటి అనుమతులు రాలేదు, మేము ఏదో తిరుగుతున్నాము.. వచ్చినా అది ఇప్పట్లో కాదు అని అన్నారు. ఇప్పటికే భువనగిరి దగ్గర రాయగిరి నుంచి పోయే ఉత్తరభాగానికి అతీగతీ లేదు. ఇక మీవైపు ఇప్పట్లో అయ్యేది కాదన్నారు. అది పూర్తి అయ్యేవరకు నీనుంటనో, నువ్వుంటో తెల్వదు. అన్నారు. మీ భూములు మీరు దున్నుకోపోండి అంటూ మాట్లాడని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.