Gadwala MLA Krishnamohan Reddy | ఇంతకు గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో .. తిరిగి బీఆరెస్‌లో కొనసాగుతానని చెప్పిన కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆరెస్ పార్టీలో కొనసాగుతానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చెప్పడం ఆసక్తికరంగా మారింది. మంగళవారం అసెంబ్లీ ల్యాబీల్లో బీఆరెస్ ఎమ్మెల్యేల వద్ధకు వెళ్లి కలిశారు

విధాత, హైదరాబాద్ : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆరెస్ పార్టీలో కొనసాగుతానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చెప్పడం ఆసక్తికరంగా మారింది. మంగళవారం అసెంబ్లీ ల్యాబీల్లో బీఆరెస్ ఎమ్మెల్యేల వద్ధకు వెళ్లి కలిశారు. అక్కడ ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలతో, కేటీఆర్‌తో కలిశారు. అనంతం బీఆరెస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లి కేటీఆర్‌ను కలిశారు. తాను తిరగి బీఆరెస్‌లోనే కొనసాగుతానని, త్వరలోనే కేసీఆర్‌ను కలిసి పార్టీ మారాల్సిన పరిస్థితులపై వివరిస్తానని చెప్పినట్లుగా సమాచారం. కాంగ్రెస్‌లో తాను ఇమడలేకపోతున్నట్గులా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామం బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న బీఆరెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వంలో యూటర్న్ కోణానికి నిదర్శనంగా మారింది. జూలై 6వ తేదీన కృష్ణామోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం కాలంలోనే ఆయన యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. బీఆరెస్ ఎమ్మెల్యేలతో తిరిగి గద్వాల ఎమ్మెల్యే కృష్ణామోహన్‌రెడ్డి భేటీపై అలర్టయిన కాంగ్రెస్ నాయకత్వం ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తంది. అయితే అసలు తాను ఏ పార్టీలో కొనసాగుతున్నారన్నదానిపై స్వయంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మీడియా ముందు ప్రకటన చేస్తేగాని స్పష్టత రానుంది.