KTR | రిజువనేషన్ స్పెలింగ్ చెప్తే రూ. 50 లక్షలు పట్టే బ్యాగు పంపిస్తా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపరాఫర్..
KTR | నిన్న సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) దాదాపు రెండున్నర గంటల పాటు తాను ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నానని అనుకుని తన సంపూర్ణమైన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. చేయని సర్వేలను చేసినట్టు.. అబద్ధాలు, అసత్యాలు, అర్ధ సత్యాలను అర్థంపర్థం లేని అసంబద్ద వాదనలను సంపూర్ణంగా బయపటెట్టి తన పరువు తానే తీసుకున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) విమర్శించారు.

హైదరాబాద్ : మూసీ సుందరీకరణ( Musi Beautification ) విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నిన్న నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తెలంగాణ భవన్( Telangana Bhavan )లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూనే.. సందర్భోచితంగా రేవంత్ రెడ్డిపై సెటైర్లు, విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని, రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ అపరిచితుడిలాగా మారిపోయాడని విమర్శించారు. మూసీ ప్రక్షాళన ఇష్టం లేదని మీరంటే ఖర్చు పెట్టిన 140 కోట్లు నా ఆస్తి అమ్మైన కడుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి అఫిడవిట్‌లో ఏమో 30 కొట్లే తన ఆస్తి అని చూపించాడంటూ కేటీఆర్ ఎద్దెవా చేశారు. చివరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముగింపు సందర్భంగా రేవంత్ రెడ్డికి ఒక బంపరాఫర్ ఇస్తున్నట్టు కేటీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు.
అదేంటంటే.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు( Musi Project )ను వ్యతిరేకించే వారు కసబ్ కంటే ప్రమాదకారి అన్నారు. కసబ్( Kasab ) ఒక టెర్రరిస్ట్( Terrorist ).. మన దేశ ప్రజలను కెమెరాల ముందే కాల్చి చంపాడు. వాడికి ఉరేయడానికి నాలుగేండ్లు సమయం పట్టింది ఈ దేశంలో. నీవు కూడా 50 లక్షల రూపాయాలతో దొరికినోడివి. 9 ఏండ్లు అవుతుంది.. నీకు శిక్ష పడలేదు. అందుకే సీఎంకు ఒక బంపరాఫర్ ఇస్తున్నా.. సరే ఎవరు కసబో.. ఎవరు ఏందో ప్రజలు తేలేస్తారు. రిజువనేషన్( Rejuvenation ) అనే మాట నిన్న చాలాసార్లు వాడావు కదా..? రిజువనేషన్ అనే దానికి నీవు స్పెల్లింగ్ కింద పేపర్ చూడకుండా చెప్పు. అది గనుక చెప్తే నేను నీకు బంపరాఫర్ ఇస్తున్నా.. 50 లక్షల రూపాయాలు పట్టే.. తళతళలాడే ఓ కొత్త బ్యాగ్ నేను నీకు గిఫ్ట్ ఇస్తా. ఎందుకంటే నీకు బ్యాగులు అవసరం. ఢిల్లీకి తీసుకెళ్లాలి కదా.. రిజువనేషన్( Rejuvenation ) అనే దానికి స్పెలింగ్ చెప్తే మా పార్టీ తరపున తళతళలాడే బ్యాగు తప్పకుండా పంపిస్తా అని కేటీఆర్( KTR ) పేర్కొన్నారు.
అపరిచితుడిలా మారిన రేవంత్ రెడ్డి
ఇక మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదటు వాడింది రేవంత్ రెడ్డి. గోపన్‌పల్లిలో మాట్లాడుతూ లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఆయన ఒక అపరిచితుడిలా మారారు. ఆయన నోట్లో నుంచి అబద్ధాలు వస్తున్నాయి. లక్షన్నర కోట్లు ఎవరు అన్నారని అంటుండు. నల్లగొండకు మంచినీళ్లు ఇస్తుంటే మీకు మనసున పడుతలేదా అంటున్నాడు. నల్లగొండ జిల్లా ప్రజలను రెచ్చగొడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా..
మూసీ మురికి కూపంగా మారిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. మూసీని మురికి కూపంగా మార్చింది కచ్చితంగా గత పాలకులే.. అందులో సింహభాగం కాంగ్రెస్ ప్రభుత్వానిది అయితే.. కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానికి కూడా దక్కుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూటల కోసమే
ఇది మూసీ బ్యూటీఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెటమలు పడుతున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్న క్రమంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూటల కోసమే అని తేలిపోయిందని కేటీఆర్ ఆరోపించారు.