ఉస్మానియూ యూనివర్సిటీ సెలవుల విషయంలో బీఆరెస్ సోషల్ మీడియా ప్రతినిధి మన్నె క్రిశాంక్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు
విధాత : ఉస్మానియూ యూనివర్సిటీ సెలవుల విషయంలో బీఆరెస్ సోషల్ మీడియా ప్రతినిధి మన్నె క్రిశాంక్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. బుధవారం కేటీఆర్ చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ములాఖత్‌లో కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ క్రిశాంక్‌పై రాజకీయ కక్షతో సీఎం రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నిపుణుల ముందు నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దామని సవాల్ చేశారు. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడ జైలులో కూర్చోవాలో కూడా తేలుద్దామన్నారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకుని చేసిన తప్పును సరిదిద్దుకుని క్రిశాంక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.