రేపు కేటీఆర్ కరీంనగర్‌ టూర్‌.. జగిత్యాలలో జీవన్‌రెడ్డితో భేటీ : పార్టీలోకి ఆహ్వానం

కరీంనగర్‌లో రేపు కేటీఆర్ కీలక సమావేశం, అనంతరం జగిత్యాలలో జీవన్‌రెడ్డితో భేటీ. బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్​ మాజీ నేత చేరికపై చర్చలు వేగం పుంజుకుంటున్నాయి.

రేపు కేటీఆర్ కరీంనగర్‌ టూర్‌.. జగిత్యాలలో జీవన్‌రెడ్డితో భేటీ : పార్టీలోకి ఆహ్వానం కేటీఆర్‌, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి భేటీ - బీఆర్‌ఎస్‌ చేరికపై ఊహాగానాలు

KTR Karimnagar Visit: Key Talks with Jeevan Reddy in Jagtial ‌‌

విధాత బ్యూరో | కరీంనగర్​:

KTR – Jeevan Reddy | తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు జగిత్యాలలో కాంగ్రెస్​ మాజీ నేత జీవన్​రెడ్డిని కలవనుండటం కీలక పరిణామంగా కనిపిస్తోంది.

కరీంనగర్‌లో కీలక సమావేశం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. జిల్లా స్థాయిలో పార్టీ వ్యూహాలపై ఈ మీటింగ్ కీలకంగా మారనుంది.

 జగిత్యాలలో జీవన్‌రెడ్డితో భేటీ

అనంతరం కేటీఆర్ బీఆర్‌ఎస్ నేతలతో కలిసి జగిత్యాలకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి టి.జీవన్​రెడ్డిని తన నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం కానున్నారు.

ఇప్పటికే బుధవారం జీవన్​రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌, చేరికపై ప్రాథమిక చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీతో ఆయన బీఆర్‌ఎస్‌లోకి అడుగుపెట్టే ప్రక్రియ చివరి అంకానికి చేరనుంది.

ఏప్రిల్‌ 13 చేరిక? రాజకీయంగా కీలక సంకేతాలు

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల కారణంగా ఇటీవల రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి, కొత్త రాజకీయ వేదికను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరే దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. అన్ని అనుకున్నట్లే జరిగితే, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు సమక్షంలో ఏప్రిల్‌ 13న ఆయన అధికారికంగా పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.