సీబీఐ ఢిల్లీ ఆఫీస్‌లో కవితను కలిసిన కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్‌కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు

విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీలో విచారణలో ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె భర్త అనిల్‌కుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు కలిశారు. లిక్కర్ కేసులో కవితను రెండో రోజు కూడా సీబీఐ ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న మూడు రోజుల్లో ప్రతి రోజు సాయంత్రం 6నుంచి 7గంటల మధ్యన కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు కోర్టు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో అనిల్, కేటీఆర్‌లు కవితను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలు, ఇంటరాగేష్ తీరుతెన్నులను తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు.