chakali ilamm । ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేశాం: కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ అని కేటీఆర్ కొనియాడారు. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమే స్ఫూర్తి అని చెప్పారు. ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనదని చాటి చెప్పిన యోధురాలంటూ ఘనంగా నివాళులర్పించారు.

chakali ilamm । వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీకని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఐటమ్మ జయంతిని పురస్కరించుకుని ఆయన ఎక్స్‌లో నివాళులర్పించారు. ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లటంలో బీఆరెస్ మొదటి వరుసలో ఉంటుందని చెప్పారు. పేదలు, బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించటమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ అని కేటీఆర్ కొనియాడారు. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమే స్ఫూర్తి అని చెప్పారు. ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనదని చాటి చెప్పిన యోధురాలంటూ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశమని కేటీఆర్ పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగిందని తెలిపారు. బడుగులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారని గుర్తు చేశారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారని, ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించారని తెలిపారు.