Nalla Surya Prakash | పాలకుల అండతోనే భూకబ్జాలు

పేదలకు చెందాల్సిన వివిధ రకాల ప్రభుత్వ భూములు పాలకుల కను సన్నల్లో కబ్జాలకుగురవుతున్నాయని, పోరాటాల ద్వారానే పేదలు భూములను హక్కులను సాధించుకోవాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ పిలుపునిచ్చారు.

Nalla Surya Prakash | పాలకుల అండతోనే భూకబ్జాలు

భూమిలేని పేదలు అధిక శాతం సామాజిక తరగతులే

భూ పోరాటాలే పేదలకు భూములు దక్కేలా చేస్తాయి

బిఎల్ఎఫ్ ఉమ్మడి జిల్లా భూ సదస్సులో రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్

విధాత, వరంగల్ ప్రతినిధి : పేదలకు చెందాల్సిన వివిధ రకాల ప్రభుత్వ భూములు పాలకుల కను సన్నల్లో కబ్జాలకుగురవుతున్నాయని, పోరాటాల ద్వారానే పేదలు భూములను హక్కులను సాధించుకోవాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ పిలుపునిచ్చారు.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా సదస్సు ఎంసీపీఐ వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ నర్ర ప్రతాప్ అధ్యక్షతన స్థానిక ఓంకార్ భవన్ ఆవరణలో సోమవారం జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్ల సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఆనాడు నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా భూమి బుక్తి విముక్తి కోసం పోరాడి భూములను సాధించుకుంటే నేడు కూడా స్వరాష్ట్ర పాలనలో భూమికోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొనడం సిగ్గుచేటు అన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు అధిక శాతం భూమిలేని నిరుపేదలుగా, శ్రమజీవులుగా, కనీస సౌకర్యాలు అందని సామాజిక తరగతులుగా జీవిస్తున్నారని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం అగ్ర వర్ణ, కుల పాలకుల విధానాలేనని విమర్శించారు. అధికార మార్పిడిలు జరిగినా దోపిడి విధానాలు మారటం లేదని, ఏవో కొన్ని ఉచిత సంక్షేమ పథకాలు అని ప్రవేశపెట్టి జీవనాధారంగా నిలవాల్సిన భూమి, ఉపాధి, విద్యా, వైద్యం అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న శ్రమజీవులు అయినా బడుగు బలహీన వర్గాలు ఏకమై భూములను హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పాలకవర్గాల మెడలు వంచేలాగా ప్రజలను కదిలించి పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు .

 

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ చరిత్రలో పోరాడకుండా భూమి దక్కిన దాఖలాలు లేవని అన్నారు. పాలకులు ఎప్పుడూ దోపిడిదారుల కబ్జాదారుల పక్షాన నిలుస్తారని, పేదలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నీతిగా నిజాయితీగా పేదల పక్షాన సామాజిక తరగతులు అందరికీ భూములు దక్కేలా కార్యకర్తలు పోరాడాలని కోరారు. ఆ దిశలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో ఎంసిపిఐ(యు) పోలిట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి, వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు మారోజు సునీల్, వంగల రాగసుధ, నీల రవీందర్, కుసుంబ బాబూరావు, కనకం సంధ్య, యూపీ రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, వృత్తి సంఘాల రాష్ట్ర బాధ్యుడు నాగేల్లి కొమురయ్య, ఎంసిపిఐ(యు) కార్యదర్శి సుంచు జగదీశ్వర్, బిఎల్ఎఫ్ తూర్పు కన్వీనర్ ఐతమ్ నగేష్ వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.