వన్యప్రాణులు అభయారణ్యాలలో రోడ్డు దాటుతూ మృతి చెందడం ఇటీవల పెరిగిపోతుంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి అక్కడిక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు, అటవీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల తరుచూగా పెద్ద పులులు, చిరుత పులి శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గంలో రోడ్డు దాటుతున్న వీడియో దృశ్యాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు వాహనదారులను వన్యప్రాణుల సంచారం నేపథ్యంలో నెమ్మదిగా వెళ్లాలని సూచికలు ఏర్పాటు చేశారు. అయినప్పటికి వాహనం ఢీ కొట్టి ఓ చిరుత మృతి చెందడం విచారకరం.
నాగర్ కర్నూల్ జిల్లా : రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి!
హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వేగంగా వచ్చి చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని
వాహనం ఢీకొనడంతో, చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి… pic.twitter.com/KQHENxUWET
— Maxnews Telangana (@MaxNewsTS) August 17, 2026
