Leopard | శంషాబాద్‌లో మరో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో మరో చిరుత సంచారం కలకలం సృష్టించింది. సీసీ కెమెరాలో చిరుత కదలికలు రికార్డవ్వడంతో మాన్సీమియాగూడలో ఆటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు

నిజమాబాద్‌లో చిరుతరు తప్పించబోయి కారు ఫల్టీ..మహిళ మృతి
మహానందిలోనూ చిరుత సంచారం
నంద్యాల ఘాట్ రోడ్డులో మాజీ సర్పంచ్‌ను చంపిన చిరుత
విధాత, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో మరో చిరుత సంచారం కలకలం సృష్టించింది. సీసీ కెమెరాలో చిరుత కదలికలు రికార్డవ్వడంతో మాన్సీమియాగూడలో ఆటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత ఆచూకీ కోసం 20 కెమెరాలతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో అడవి పిల్లి కదలికలు కనిపించాయి. చిరుతపులి సంచరిస్తోందనే అనుమానంతో అధికారులు బుధవారం మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల శంషాబాద విమానాశ్రయం ప్రాంతంలో సంచరించిన ఓ చిరుతను బంధించిన అటవీ అధికారులు, ఇప్పుడు మరో చిరుత సంచారం వెలుగుచూడటంతో దానిని కూడా బంధించే ప్రయత్నాలు చేపట్టారు.
చిరుతను తప్పించబోయి..కారు ఫల్తీ.. మహిళ మృతి
నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలం ఎల్లమ్మ కుంట శివారులో చిరుతను తప్పించబోయి కారు బోల్తాపడటంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన లలిత అక్కడికక్కడే మృతి చెందింది. లలిత భర్త ప్రభాకర్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రభాకర్‌రావును హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మహనంది క్షేత్రంలో చిరుత కలకలం
మహనంది క్షేత్రంలో చిరుత సంచారం కలకలం రేపింది. స్థానిక గోశాల వద్ద సీసీ టీవీ ఫుటేజ్ లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. చిరుత సంచారంతో భక్తులు, స్థానికలు భయభ్రాంతులకు గురై ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అటవీ శాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను నిర్ధారించుకుని దానిని బంధించేందుకు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులు పెంపుడు జంతువులను బయట వదలవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నంద్యాల ఘాట్ రోడ్డులో మాజీ సర్పంచ్‌ను చంపిన చిరుత
నంద్యాల – గిద్దలూరు ఘాట్ రోడ్డులో కట్టెల కోసం అడవిలోని వంక వద్దకు వెళ్లిన మాజీ మహిళా సర్పంచ్ మెహరున్నీసాపై అనే చిరుత దాడి చేసి చంపివేసింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నంద్యాల-గిద్దలూరు ఘాట్‌లో 4రోజులుగా సంచరిస్తున్న ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు 10 కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు.