Leopard | మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చిరుతపులి సంచారం.. వీడియో
Leopard | హైదరాబాద్( Hyderabad ) నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్( Miyapur Metro Station ) వద్ద ఓ చిరుత పులి( Leopard ) కలకలం సృష్టిస్తోంది. మెట్రో స్టేషన్ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.

Leopard | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్( Miyapur Metro Station ) వద్ద ఓ చిరుత పులి( Leopard ) కలకలం సృష్టిస్తోంది. మెట్రో స్టేషన్ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు( Forest Officers ) అప్రమత్తం అయ్యారు.
మియాపూర్ మెట్రో స్టేషన్( Miyapur Metro Station ) తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు( Forest Officers ) నిఘా పెట్టారు. యాంటీ పోచింగ్ స్క్వాడ్ ప్రతినిధులు ఆ ఏరియాలో చిరుత( leopard ) ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఓ అధికారి మాట్లాడుతూ.. వీడియోలో పచ్చని పొదలు, పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అవి మెట్రో స్టేషన్ వద్ద పరిసర ప్రాంతాల్లో లేవు. ఏది ఏమైనప్పటికీ చిరుత నిజంగానే సంచరిస్తుందా..? లేదా..? అనే విషయంలో తనిఖీలు, నిఘా ఉందని పేర్కొన్నారు. ఈ వీడియోను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసే అవకాశం లేదన్నారు. అమీన్‌పూర్( Ameenpur ) అటవీ ప్రాంతం వైపు నుంచి చిరుత మియాపూర్ వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలోనూ ఇక్రిశాట్( ICRISAT ) పరిసర ప్రాంతాల్లో రెండు చిరుత పులులు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.
మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం
హైదరాబాద్ – మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో సంచరిస్తున్న చిరుత.
చిరుత సంచారంతో భయాందోళనలో ఉన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. pic.twitter.com/EgCWfIm0ld
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024