Leopard | బావిలో పడ్డ చిరుత.. నిప్పుతో కాపాడిన అటవీ సిబ్బంది..!
Viral Video | Leopard | అప్పుడప్పుడు జంతువులు ప్రమాదవశాత్తు బావుల్లో పడుతుంటాయి. బురదలో కూరుకుపోతుంటాయి. అలాంటి జంతువులను కాపాడేందుకు అధికారులు, జనాలు శతవిధాలా ప్రయత్నిస్తారు. అలానే బావిలో పడ్డ చిరుతను ప్రాణాలను కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఆ చిరుతను ప్రాణాలతో కాపాడారు. సహన సింగ్ అనే ట్విట్టర్ యూజర్.. బావిలో పడ్డ చిరుత వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగి ఉండొచ్చు. ప్రమాదవశాత్తు ఓ […]
Viral Video | Leopard |
అప్పుడప్పుడు జంతువులు ప్రమాదవశాత్తు బావుల్లో పడుతుంటాయి. బురదలో కూరుకుపోతుంటాయి. అలాంటి జంతువులను కాపాడేందుకు అధికారులు, జనాలు శతవిధాలా ప్రయత్నిస్తారు. అలానే బావిలో పడ్డ చిరుతను ప్రాణాలను కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఆ చిరుతను ప్రాణాలతో కాపాడారు.
సహన సింగ్ అనే ట్విట్టర్ యూజర్.. బావిలో పడ్డ చిరుత వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగి ఉండొచ్చు. ప్రమాదవశాత్తు ఓ చిరుత పులి బావిలో పడింది. దాన్ని ప్రాణాలతో రక్షించేందుకు బావిలో నిచ్చెన కూడా ఏర్పాటు చేశారు.
ఇక ఒక కట్టెకు నిప్పంటించి సెగ పెట్టడంతో.. నిచ్చెన ద్వారా పైకి వచ్చిన చిరుత.. అక్కడున్న గోడ దూకి అడవిలోకి పారిపోయింది అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతను ప్రాణాలతో కాపాడిన అటవీ శాఖ సిబ్బంది, స్థానికులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram