కులగణన చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి..మాజీ ఎమ్మెల్యే పటోళ్ల
: రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదికన కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి లేఖ శుక్రవారం లేఖ రాశారు.

విధాత : రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదికన కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి లేఖ శుక్రవారం లేఖ రాశారు. ఈ విషయంలో గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. జనాభాలో ప్రస్తుతం 42 శాతంకు పైగా బీసీలు ఉన్నారని, బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన చేసి తర్వాతే సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.