Warangal | వరంగల్‌లో దారుణం.. కుటుంబంపై కత్తితో దాడి, ఇద్దరు మృతి

వరంగల్ చెన్నారావుపేట 16 తండాలో గురువారం దారుణం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్ని తన ప్రియురాలు దీపిక కుటుంబంపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు

Warangal | వరంగల్‌లో దారుణం.. కుటుంబంపై కత్తితో దాడి, ఇద్దరు మృతి

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ చెన్నారావుపేట 16 తండాలో గురువారం దారుణం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్ని తన ప్రియురాలు దీపిక కుటుంబంపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు.

కత్తితో దాడి చేసిన ఘటనలో దంపతులు బానోతు శ్రీనివాస్, సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు బానోతు మదన్, కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీపిక, నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరి మధ్య ఇటీవల మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లు సమాచారం ఈ కోపంతో నాగరాజు పథకం ప్రకారం దీపిక కుటుంబంపై తల్వార్‌తో దాడి చేసినట్లు చెబుతున్నారు సంఘటన సమాచారం. తెలియగానే హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. దానికి పాల్పడ్డ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.