భూవివాదం.. వ్యక్తిని కొట్టి చంపిన దాయాదులు
భూ తగాదాల్లో దాయాదులు ఓ వ్యక్తి ని కొట్టిచంపారు. ఈ సంఘటన నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం చిన్న పోర్ల గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది
నారాయణ పేట జిల్లాలో ఘటన
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: భూ తగాదాల్లో దాయాదులు ఓ వ్యక్తి ని కొట్టిచంపారు. ఈ సంఘటన నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం చిన్న పోర్ల గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన సంజప్ప జీవనోపాధి కోసం గ్రామం విడిచి కుటుంబంతో సహా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వర్షం కురవడంతో గ్రామంలో తనకున్న నాలుగు ఎకరాల్లో విత్తనాలు వేసేందుకు వచ్చాడు. పొలం వద్దకు వెళ్లిన సమయంలో సంజప్ప దాయాదులు గొడవకు దిగారు.
మాట మాట పెరగడంతో గొడవ తీవ్ర మైంది. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు కలిసి సంజప్పపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. పలువురు గ్రామస్తులు విడిపించి గాయపడిన సంజప్పను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంజప్ప మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాడి జరుగుతున్న సమయంలో కొందరు ఉట్కూరు పోలీసులకు సమాచారం ఇచ్చినా అక్కడి ఎస్ఐ నిర్లక్ష్యం వహిచడంతో ఈ దారుణం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram