మీనాక్షి నటరాజన్ పై కేసు నాంపల్లి కోర్టులో విచారణ.. భద్రత కల్పించాలన్న శ్రీలత

మీనాక్షి నటరాజన్ పై దాఖలైన ప్రైవేటు కేసు శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు వేసిన మహిళ శ్రీలత కోర్టుకు రావడంతో మీడియా ఆమె స్పందన కోసం ప్రయత్నించడం..ఆమెను ఎవరో గుర్తు తెలియన వ్యక్తులు అనుసరిస్తున్నారన్న అనుమానాలు వైరల్ గా మారాయి. ఈ కేసులో ఈ రోజు శ్రీలత స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాల్సి ఉంది. అయితే టైపిస్టు విధులలో లేనందునా ఈ ప్రక్రియ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అటు మీనాక్షీ నటరాజన్ తరుపు న్యాయవాది కేసు విచారణకు హాజరుకావడం మరింత ఆసక్తికరంగా మారింది.

విధాత, హైదరాబాద్ : మీనాక్షి నటరాజన్ పై దాఖలైన ప్రైవేటు కేసు శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు వేసిన మహిళ శ్రీలత కోర్టుకు రావడంతో మీడియా ఆమె స్పందన కోసం ప్రయత్నించడం..ఆమెను ఎవరో గుర్తు తెలియన వ్యక్తులు అనుసరిస్తున్నారన్న అనుమానాలు వైరల్ గా మారాయి. కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి తనపై వేధింపులకు ప్రయత్నించారని, దీనిపై కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదంటూ బాధితురాలు శ్రీలత కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈ రోజు శ్రీలత స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాల్సి ఉంది. అయితే టైపిస్టు విధులలో లేనందునా ఈ ప్రక్రియ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అటు మీనాక్షీ నటరాజన్ తరుపు న్యాయవాది కేసు విచారణకు హాజరుకావడం మరింత ఆసక్తికరంగా మారింది.

బాధితురాలు శ్రీలత నారాయణపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు దాఖలు చేసింది. కుంభం శివకుమార్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మరియు మీనాక్షి నటరాజన్‌పై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో ఈ కేసు అంశాన్నిపేర్కొనకపోవడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో సంబంధిత కేసు నాంపల్లి కోర్టులో విచారణకు రావడం గమనార్హం.

నాకు భద్రత కల్పించాలి : బాధితురాలు శ్రీలత

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో తన భద్రతకు ప్రమాదం ఏర్పడిందని బాధితురాలు శ్రీలత తెలిపారు. ఈరోజు కోర్టుకు హాజరైన సందర్బంగా నన్ను గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించారని, నా కదలికలపై వీడియోలు తీశారని బాధితురాలు మీడియా ముందు తన ఆందోళన వ్యక్తం చేసింది. నాకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని, దీనిపై మూడు రోజుల క్రితమే డీజీపీని కలిసి వినతి పత్రం అందించానని తెలిపింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంతో నాకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

జూన్ 6న తాను కోర్టుకు వెళ్లినప్పుడు.. కోర్టు బయటే ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి పీఏ నిల్చుని ఉన్నాడని, కేసు వివరాలు అడిగాడని, తాను ‘ఎందుకు?’ అని అడిగేసరికి అతను వెళ్లిపోయాడని, సెక్షన్ ఆఫీస్ లో వెళ్లి చూసేసరికి తన ఫైల్ టేబుల్ మీద ఉందని శ్రీలత ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ వ్యక్తి కోర్టుకు ఎందుకు వచ్చారో, ఆ ఫైల్ ఎందుకు అడిగారో నాకు తెలియదు అని, దీనిపై విచారణ జరపాలనుకుంటే.. కోర్టు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అతనెవరో తెలిసిపోతుందని పేర్కొంది. నేను కేసు నిమిత్తం కోర్టు సెక్షన్ ఆఫీసులో ఉన్నప్పుడు నా కేస్ ఫైల్ టేబుల్ మీద ఉండగా ఎవరూ లేని సమయంలో అది బయటకు వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై ప్రారంభమైన విచారణ

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. ఈ కేసు విచారణ సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణను నిరసిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఓటు చోరీ నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.

Latest News