చిరు ఉద్యోగులను తొలగించొద్దు…
మీర్‌పేట్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవద్దని కిచ్చెన్న భరోసా ఇచ్చారు జీతాలు ఉద్యోగ భద్రత కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు.

మీర్‌పేట్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కిచ్చెన్న భరోసా
విధాత : మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేసే ఏ చిరు ఉద్యోగిని తొలగించవద్దని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. మీర్ పేట కార్పొరేషన్‌లో పని చేస్తున్న పలువురు ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులు సోమవారం కేఎల్ఆర్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా.. ఉద్యోగాల నుంచి తీసివేస్తామని అధికారులు చెబుతున్నారని మహిళ వర్కర్లు గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన కిచ్చెన్న.. మీర్ పేట్ మున్సిపల్ కమిషనర్ నాగమణితో ఫోన్ లో మాట్లాడారు. వారికి జీతాలు ఇవ్వటంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడతానని కిచ్చెన్న హామీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా మున్సిపాలిటీల్లో శానిటేషన్ సహా ఇతర విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసివేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని లక్ష్మారెడ్డి చెప్పారు.