Medipathnam Bus Fire : ఆర్టీసీ బస్సుల్లో మంటలు..హైదరాబాద్ లో ఘటన!
హైదరాబాద్ మేదిపట్నం లో RTC సిటీ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, వీడియో వైరల్ అయ్యింది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) సిటీ బస్సులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ లోని మేదిపట్నం(Mehdipatnam) వద్ధ ఆర్టీసీ సిటీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు అంతా వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే బస్సు నుంచి దిగిపోయారు. వారంతా ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే మంటల్లో బస్సు చాలవరకు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం మంటలను అర్పివేశారు. ఈ ఘటన ఆ మార్గంలో వెలుతున్న వాహనదారులను సైతం భయాందోళనలకు గురి చేసింది. మంటల్లో బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలను అంతా సెల్ ఫోన్లలో వీడియో తీయడంతో నిమిషాల్లో అది వైరల్ గా మారింది. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram