• Telugu News
  • /Telangana

Rains | తెలంగాణలో మరో మూడు రోజులు వానలు

తెలంగాణాలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

Reported by: Somu | తెలంగాణ‌ | May 19, 2024, 4:31 pm IST
Read Time: 2 mins
Rains | తెలంగాణలో మరో మూడు రోజులు వానలు

విధాత : తెలంగాణాలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు ఈరోజు మాల్దీవులులో, కోమరిన్ ప్రాంతంలో కొంతమేరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. దక్షిణ చత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 31 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని తెలిపారు.