Telangana : మిలాదున్ నబి ఉత్సవాలకు నిధులివ్వండి : సీఎం రేవంత్ రెడ్డికి వినతి

మిలాదున్ నబి ఉత్సవాల కోసం తెలంగాణ మసీదులు, దర్గాలకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి.

Telangana : మిలాదున్ నబి ఉత్సవాలకు నిధులివ్వండి : సీఎం రేవంత్ రెడ్డికి వినతి

విధాత, హైదరాబాద్ : మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాదున్ నబి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చారిత్రాత్మక మసీదులు, దర్గాలను అలంకరించి ఉచిత విద్యుత్ అందించాలని మర్కజీ మిలాద్ జూలూస్ కమిటీ బృందం శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. మిలాద్ నబి ఉత్సవాలకు కావాల్సిన నిధులు విడుదలు చేయాలని కోరారు. అలాగే మిలాదున్ నబి సందర్భంగా సెప్టెంబర్ 14న తెలంగాణ అంతటా ఊరేగింపులకు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మర్కజీ మిలాద్ జూలూస్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు మిలాదున్ నబి పర్వదినం వస్తుంది. భారతదేశంలో మిలాదున్ నబి సందర్భంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తారు.