Asaduddin Owaisi | జూబ్లీహిల్స్ సీటుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి నవీన్‌కు 2028లో మేమే..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోకవర్గం విషయంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ఈసారికి నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటిస్తున్నామని, కానీ.. 2028 ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని చెప్పారు.

Asaduddin Owaisi | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీ.నవీన్ యాదవ్ కు తమ పార్టీ మద్ధతు ఇస్తున్నదని, అందుకే అభ్యర్థిని బరిలో నిల్చోబెట్టలేని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవడం మూలంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కాదని, పాత ప్రభుత్వం కూలిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు నియోకవర్గ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం ఇచ్చారని, కాని ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు.
వార్డులలో ఎక్కడా కూడా ఆ ఛాయలు కన్పించడం లేదని, ఓటర్లు అభివృద్ధి చేసే వారికే ఈసారి ఓటు వేస్తారన్నారు. కావున యువకుడు అయిన నవీన్ యాదవ్ కు ఓట్లు వేసి గెలిపించాలని అసదుద్దీన్ ఓటర్లను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుందని, ఈ ఎన్నికల మూలంగా ప్రభుత్వంలో మార్పులు ఉండవనే ఉద్ధేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 2028 లో జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.