ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను బహిష్కరించిన ఎంఐఎం

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ఎంఐఎం ప్రకటించింది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జా రహ్మత్ బేగ్‌ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసన మండలి చైర్మన్‌కు సమర్పించాలని ఆదేశించారు.

విధాత, హైదరాబాద్ : ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ఎంఐఎం ప్రకటించింది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జా రహ్మత్ బేగ్‌ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసన మండలి చైర్మన్‌కు సమర్పించాలని ఆదేశించారు.

అత్తాపూర్‌లో మైనర్ అమ్మాయిపై అఘాయిత్వం చేస్తుంటే..కొందరు యువకులు పట్టుకొని కొట్టి, వీడియోలు తీశారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆరోపణలే పార్టీ నిర్ణయానికి కారణమని ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయనపై పార్టీ తీసుకున్న చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Latest News