MLA Majid Hussain | విద్యుత్తు బిల్లుల వసూళ్ల ప్రైవేటీకరణకు ఎంఐఎం మద్ధతు
రాష్ట్రవ్యాప్తంగా జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలకు చెందిన విద్యుత్తు బిల్లులను వసూలు చేయడానికి అదానీ పవర్ గ్రూప్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఒప్పందంలో భాగంగా పాతబస్తిలో పైలట్ ప్రాజెక్టు కింద బిల్లులు వసూలు చేపట్టారు
విధాత, హైదరాబాద్ :. రాష్ట్రవ్యాప్తంగా జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలకు చెందిన విద్యుత్తు బిల్లులను వసూలు చేయడానికి అదానీ పవర్ గ్రూప్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఒప్పందంలో భాగంగా పాతబస్తిలో పైలట్ ప్రాజెక్టు కింద బిల్లులు వసూలు చేపట్టారు. దీనిపై బీఆరెస్ సహా కొన్ని పార్టీలు, సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణలో భాగమే ఈ చర్య అని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాత్రం బిల్లుల వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని సమర్ధించడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాజిద్ హుస్సెన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు బిల్లుల వసూళ్లను ప్రైవేటు సంస్థల ద్వారా చేపట్టడానికి ఎంఐఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పడం చర్చనీయాంశమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram