Minister Damodar Raja Narasimha | జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ సబ్ కమిటీ భేటీ

జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్‌ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు

  • By: Somu |    telangana |    Published on : Jul 22, 2024 4:22 PM IST
Minister Damodar Raja Narasimha | జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ సబ్ కమిటీ భేటీ

పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
పాత జిల్లాల వారిగా పరిష్కార యోచన

విధాత, హైదరాబాద్ : జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్‌ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో తొమ్మిది ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు శాఖలపరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో పలు అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించిందని తెలిపారు.

సబ్ కమిటీ సమావేశంలో వివిధశాఖల ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేశ్‌ కుమార్‌ ఎక్కా దత్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ షికా గోయల్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, వైద్యారోగ్యశాఖ, జీఏడీ ఉన్నతాధికారులు వినయ్ కృష్ణారెడ్డి, బూసని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.