• Telugu News
  • /Telangana

Damodaram Rajanarasimha | పైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు ప్రభుత్వం కృషి : మంత్రి దామోదరం రాజనరసింహ

రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకుగాను తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంగారెడ్డి, మహబూబాద్ జిల్లాల పరిధిలోని 14 ఆరోగ్య కేంద్రాల లో

Reported by: Subbu | తెలంగాణ‌ | Aug 10, 2024, 3:30 pm IST
Read Time: 4 mins
Damodaram Rajanarasimha | పైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు ప్రభుత్వం కృషి : మంత్రి దామోదరం రాజనరసింహ

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకుగాను తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంగారెడ్డి, మహబూబాద్ జిల్లాల పరిధిలోని 14 ఆరోగ్య కేంద్రాల లో మాత్రల పంపిణీకి 2,600 మంది సిబ్బందికి శిక్షణను ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదరం రాజనరసింహ తెలిపారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో హైదరాబాదులోని తన కార్యాలయం నుంచి మంత్రి రాజనరసింహ పాల్గొని రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలపై రూపొందించిన అవగాహన కరపత్రాలను, బ్రోచర్లను మంత్రి ఆవిష్కరించారు..ఈ సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ 2522 మంది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లు క్షేత్రస్థాయిలో ఐవర్ మెక్టిన్, డీఈసీ మాత్రులను అందజేస్తారని తెలిపారు. నేటి నుంచి మాత్రలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బోదకాలు, నులి పురుగుల నివారణకు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది అందించే మాత్రలను వేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని పైలేరియా నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం మంత్రి ఐవర్ మెక్టిన్, డీఈసీ మాత్రులను వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా పాల్గొన్నారు.