కుట్ర కోణాన్ని ఛేదించాలి: హరీశ్

- కొత్త ప్రభాకర్‌రెడ్డిని దవాఖానలో
- పరిశీలించిన ఆర్థిక మంత్రి
విధాత: లోక్‌సభ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై సోమవారం జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేధించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. నిందితులను ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రభాకర్‌రెడ్డికి మరింత భద్రత పెంచాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు.
హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం మరోసారి పరామర్శించారు. సోమవారం దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా, ప్రభాకర్‌రెడ్డిపై ఓ అగంతకుడు కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే.