Minister Komatireddy | రాష్ట్ర పురోగతిలో ఆర్‌అండ్‌బి ది కీలక పాత్ర : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర పురోగతిలో ఆర్ అండ్ బి శాఖ ది కీలక పాత్ర పోషిస్తోందని రోడ్లు భవనాలు శాఖ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో విజన్ 2047 పై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Minister Komatireddy | రాష్ట్ర పురోగతిలో ఆర్‌అండ్‌బి ది కీలక పాత్ర : మంత్రి కోమటిరెడ్డి

విధాత, హైదరాబాద్ :

రాష్ట్ర పురోగతిలో ఆర్ అండ్ బి శాఖ ది కీలక పాత్ర పోషిస్తోందని రోడ్లు భవనాలు శాఖ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో విజన్ 2047 పై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంలో.. ఆర్ అండ్ బి అధికారులు, ఇంజనీర్ల పై గురుతర బాధ్యత ఉన్నదని తెలిపారు. వచ్చే ఐదేళ్లు, 10ఏళ్లు, 15ఏళ్లు ఇలా ట్రాఫిక్ అంచనా వేసి యాక్షన్ ప్లాన్ ఉండాలని ఆదేశించారు.

ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 2ఏళ్లలో కోటి చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఎన్నో బృహత్తర ప్రాజెక్ట్ లు రోడ్లు భవనాలు శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు గుర్తు చేశారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ లో రోడ్డు కనెక్టివిటీ గణనీయంగా పెంచుతాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నుండి కనెక్ట్ చేసేలా రేడియల్ రోడ్లు తెలంగాణ ముఖ చిత్రాన్నే మారుస్తాయని ఆయన వెల్లడించారు. ఎక్స్ ప్రెస్ వేలు, ఎలివేటెడ్ కారిడార్లు, నూతన ఎయిర్‌పోర్టులు తెలంగాణ అభివృద్ధిలో కీలకం కానున్నాయని పేర్కొన్నారు.

‘రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని రోడ్లు, ఎన్ని కి.మీ రోడ్లు ఉన్నాయి. సింగిల్ లేన్, డబుల్ లేన్, ఫోర్ లేన్.. ఇలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రతి రోడ్డుకు సంబంధించి వివరాల యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 8,9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో ఆర్ అండ్ బి శాఖ విజన్ డాక్యుమెంట్ వీడియో ప్రదర్శన చేయాలన్నారు. ఇప్పటి వరకు భవిష్యత్ లో చేపట్టే పనుల వివరాలు విజన్ డాక్యుమెంట్ లో కవర్ అయ్యేలా చూడాలని సూచించారు. మన్ననూర్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ – బందరు పోర్టు గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్ – విజయవాడ ఎక్స్ ప్రెస్ వే, నూతన ప్రాజెక్టుల వివరాలు అన్ని అందులో ఉండేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.