ప్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు : మంత్రి వెంకట్ రెడ్డి

అధికారం కోల్పోయిన అసహనం, కుటుంబ అంతర్యుద్ధంతోనే కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మంత్రి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

విధాత : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన అసహనం…కుటుంబంలో అంతర్యుద్దంతో ప్రస్టేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై జగిత్యాల సభలో ఇష్టారాజ్యంగ విమర్శలు చేశాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ధాన్యం కొనుగోలు, జిల్లా అభివృద్ది పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాలిక కు రంద్రాలు ఉంటే బాగుండేదని, రాష్ట్రంలో ఎవరికీ రాని అబద్ధాలు కేసీఆర్ కుటుంబానికే వస్తున్నాయని మండిపడ్డారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకునే హైడ్రాను ఎత్తివేస్తామంటూ మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే నల్గొండ ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కేసీఆర్ మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే తెలంగాణ అప్పుల కూపంగా మారుతుందన్నారు. తెలంగాణను కాపాడడం కష్టమైపోతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల భారంతో కూలిపోయిన తెలంగాణను మళ్లీ గాడిలో పెట్టామని మంత్రి వెల్లడించారు.

కేసీఆర్ ముందు తన ఇల్లు చక్కదిద్దుకొవాలని, ఆ పార్టీలో కొడుకు, అల్లుడు, చెల్లెలు మధ్య పంపకాల గొడవలతో అంతర్యుద్దం సాగుతుందని వెంకట్ రెడ్డి విమర్శించారు. అబద్ధం ఆడడంలో కేసీఆర్ ను మించినోడు ఇంకెవరూ లేరని, గతంలో దళితుడే సీఎం, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ వంటి ఎన్నో హామీలు చెప్పాడని, అవన్నీ ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు అని, ఇలాంటి అబద్ధాలు లెక్కలేనని ఉన్నాయని వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.

నల్డొండ వేదికగా కాంగ్రెస్ శంఖారావం

మూసీ ప్రాజెక్టుపై కేసీఆర్ విమర్శలు చేయడం సరికాదని, మూసీ తెలంగాణ జీవనది.. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేసి తీరుతాం అని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. నల్గొండ వేదికగా త్వరలోనే కాంగ్రెస్ శంఖారావం సభ నిర్వహించి ప్రతిపక్షాలకు కాంగ్రెస్ ప్రజాబలాన్ని చాటుతాం అన్నారు. తెలంగాణలో మళ్లీ 20 ఏళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మహిళా బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుకూలంగానే ఉందని, జీవన్ రెడ్డి లాంటి వాళ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సరైన నిర్ణయం కాదు అని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ధాన్యం కొనుగోలుపై కీలక ఆదేశాలు

ధాన్యం కొనుగోళ్లలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని అధికారులకు సూచించామని వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక్క నల్గొండ నియోజకవర్గంలోనే 2లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలని ఆదేశించినట్లుగా వెల్లడించారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అన్ని కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలని ఆదేంచామన్నారు. రాత్రి ,పగలు లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లుల కు పంపాలని, ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి, అక్కడికి ఎక్కువ లారీలు పంపాలని ఆదేశించినట్లుగా తెలిపారు. రోడ్లపై ధాన్యం పోయకుండా అవసరమైతే పాఠశాలలు,ఫంక్షన్ హాల్స్ వద్ద కేంద్రం పెట్టాలని, రైతులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగు నీరు,నీడ ఖచ్చితంగా ఉండాలని,రైతుల ఖాతాల్లో నిర్ణీత సమయంలో డబ్బులు జమ చేయాలని ఆదేశించామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ రాహు కేతువులు రేవంత్, కేసీఆర్ లు: బండి సంజయ్
చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ

Latest News