KTR vs Konda Surekha | అది భ‌రించ‌లేకే స‌మంత విడాకులు.. కేటీఆర్‌పై కొండా సురేఖ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KTR vs Konda Surekha | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌( KTR )పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ వేధింపులు భ‌రించ‌లేక‌నే నాగ‌చైత‌న్య( Naga Chaitanya ) వ‌ద్ద స‌మంత( Samantha ) విడాకులు తీసుకుంద‌ని ఆమె ఆరోపించారు.

  • By: raj |    telangana |    Published on : Oct 02, 2024 6:08 PM IST
KTR vs Konda Surekha | అది భ‌రించ‌లేకే స‌మంత విడాకులు.. కేటీఆర్‌పై కొండా సురేఖ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KTR vs Konda Surekha | కేటీఆర్‌( KTR )పై మ‌రోసారి కొండా సురేఖ( Konda Surekha ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హీరో నాగార్జున( Nagarjuna ) ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్‌( N Convention Hall )ను కూల్చ‌కుండా ఉండాలంటే స‌మంత‌( Samantha )ను త‌న వ‌ద్ద‌కు పంపించాల‌ని కేటీఆర్ కండీషన్ పెట్టాడు. కేటీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి స‌మంత ఒప్పుకోలేదు. కేటీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌క‌పోతే మా ఇంట్లో ఉండొద్ద‌ని నాగార్జున అన్నారు. అది భ‌రించ‌లేకే స‌మంత విడాకులు తీసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) హుటాహుటిన పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణం కేటీఆరే. హీరోయిన్స్‌కు మ‌త్తు మందు( Drugs ) అల‌వాటు చేసింది కూడా కేటీఆరే. మేం జ‌రిపిన విచార‌ణ‌లో చాలా షాకింగ్ విష‌యాలు తెలిశాయి. కేటీఆర్ డ్ర‌గ్స్ ఛాలెంజ్‌కు ర‌మ్మంటే రాలేదు. న‌న్ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తే ఊరుకుంటానా..? అని కొండా సురేఖ పేర్కొన్నారు.