విధాత, హైదరాబాద్ : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందని..గతంలో సరైన సమయంలో రాష్ట్రానికి యూరియా అందించలేదు అని, మళ్లీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ విషయంలో కూడ కేంద్రం వివక్షను చూపుతుండటంతో రాష్ట్రంలో ఇంధన కొరత సమస్యలు ఎదురవుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రావాల్సిన ఇంధన వాటాను తీసుకురావాల్సిన బాధ్యత, రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఎన్నికై కేంద్రమంత్రులైన ఇద్దరిపైన ఉందని, ఇప్పటికైనా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు స్పందించాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ప్రధానమంత్రి మోదీతో,కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్, డీజిల్ తక్షణమే అందించాల్సిన బాధ్యత వారిపైన ఉందని పొంగులేటి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ను సరఫరా చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే విధంగా చేస్తుందని ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం సహించబోదని తెలిపారు.
ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాలలో ఇంధన కొరత సమస్యలు.. ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో నెలకొన్నవేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షత పాటిస్తూ ఇంధన కొరత సృష్టిస్తుందన్న కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలు పూర్తిగా అవావస్తం అని కిషన్ రెడ్డి ఖండించారు. ఇంధనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, యుద్దంతో కొరత వస్తే ప్రజలకు ముందుగానే చెప్పి వారిని సిద్దం చేస్తాం అని, అంతే తప్పా దీనిపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల అవసరాలకు సరిపడేకంటే అధికంగా ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రజల సమస్యలను పరిష్కారంలో సహకరించాల్సిన ప్రధాన పార్టీ కాంగ్రెస్ అగ్రనేతలే..ఈ రోజు బెంగాల్ ఎన్నికల పోలింగ్ అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రచారం చేశారని..ఇలాంటి వారితోనే కృత్రిమ కొరత సమస్యలు ఏర్పడుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
రైతు బంధు లేదు…రాహుల్ బంధు కొనసాగుతుంది : కేటీఆర్
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల
