Ponguleti Srinivas Reddy | ఎన్నికల హామీలను అమలు చేస్తాం : మంత్రి పొంగులేటి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు
విధాత, హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సుమారు రూ.2.5 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న కిష్టాపురం- తురకగూడెం, తురకగూడెం- చితల్‌తండా రహదారుల నిర్మాణాలకు, పాలేరులో సైడ్‌డ్రైన్ నిర్మాణానికి ఆదివారం పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులను నాణ్యతతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అనంతరం కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 37మందికి రూ.8.16 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగడ్ల నర్సింహారావు అనారోగ్యంతో మృతిచెందడంతో ఆదివారం జుజ్జుల్‌రావుపేటలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram