Ponnam Prabhakar | హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా గణేశ్ ఉత్సవాలు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కోన్నారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు

Ponnam Prabhakar | హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా గణేశ్ ఉత్సవాలు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కోన్నారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.దేశంలో ముంబై తరువాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని మంత్రి అన్నారు. బోనాలు ఎలా అయితే ఘనంగా జరుగుకున్నామో అలాగే గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని తెలిపారు. హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా చూస్తామని అన్నారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హుసేన్ సాగర్ నిమజ్జనం అనే అంశంలో కోర్టు ఆదేశాలు ప్రకారం ముందుకు పోతామని చెప్పారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమై వచ్చే 17న జరగబోయే గణేష్ నిమజ్జనంతో ముగియ్యనున్నాయని, ఉత్సవాల నిర్వాహణ, నిమజ్జనం కోసం ఏర్పాట్ల పై వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.