విధాత : రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. నోటీస్‌లకు కాంగ్రెస్ నేతలెవ్వరూ భయపడబోరన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్య అన్నారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపారని, అసలు సీఎం రేవంత్‌రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 14సీట్లు గెలవబోతుందన్నారు.
నోటీసులకు భయపడేది లేదు: మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా స్పందించారు

Latest News
వద్దనుకుంటే పెట్రోల్ కొనొచ్చు.. కానీ అధిక ధర చెల్లించాలి
తెలంగాణలో సర్(SIR) గడువు పెంపు
మమత ముస్లిం రిజర్వేషన్లకు మంగళం
రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !
జయలలిత బంగ్లాను కొనుగోలు చేయనున్న సీఎం విజయ్ !?
సీఎం విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
సైకిల్‌పై కేదార్నాథ్ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!
దేశ పురోగతి మార్గం..నదుల అనుసంధానం : సీఎం చంద్రబాబు
అమెరికాతో పీస్ డీల్ కు ఇరాన్ గుడ్ బై!