MLC Kavitha | కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ.. కవితను కలిసిన కేటీఆర్, హరీశ్‌రావు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత ఆ పిటిషన్ అనూహ్యంగా వెనక్కి తీసుకుంది

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత ఆ పిటిషన్ అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కవిత తరపు లాయర్ విచారణకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టారు. దీంతో కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు.
సీబీఐ చార్జిషీట్‌లో తప్పులున్నాయని జూలై 6న కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌లో తప్పులు లేవని సీబీఐ వాదించాగా, సీబీఐ చార్జిషీట్‌ను జూలై 22న కోర్టు పరిగణలోకి తీసుకంది. ఆగస్టు 9న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగనుంది. ఈ తరుణంలో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తీహార్ జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావులు ములఖాత్‌లో కలిశారు.