అధ్యక్షుడైన బీసీ నేతను మార్చిన ఘనత బీజేపీది: బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత

విధాత ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను మార్చిన ఘనత ఆపార్టీది అని బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మంగళవారం ఆమె నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బీజేపీ నినాదం తెలంగాణలో ఎక్కడా లేదన్నారు. రాజకేయ లబ్ధి పొందడం కోసమే కోసమే బీసీ నినాదాన్ని తెరమీదకి తెచ్చారన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బీసీ నేతను మార్చేసి ఓసీకి పదవి కట్టబెట్టిన ఘనత బీజేపీది అని అన్నారు.
తెలంగాణకు బీజేపీ మనస్ఫూర్తిగా ఏనాడూ సహకారం అందించలేదని, షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ లో ఓటమి తప్పదు అని జోస్యం చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధి పదేళ్ళలో చేసి చూపిన ఘనత కేసీఆర్ అని గుర్తు చేశారు.