నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

విధాత,నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం నుంచి 60,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ఔట్ ఫ్లో కూడా 50,522 క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరుకుంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.