Python : దడ పుట్టించిన భారీ కొండ చిలువ

థాయిలాండ్ వరదల్లో 20 అడుగుల భారీ పాము కొట్టుకువచ్చింది. ఏదో జంతువును మింగేసి భారీగా ఉబ్బిన పొట్టతో నదిలో తేలుతూ వెళ్తున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Reported by: Tejaswini Nanna | వీడియోలు | Dec 22, 2025, 2:59 pm IST
Read Time: 2 mins
Python : దడ పుట్టించిన భారీ కొండ చిలువ

విధాత : అనకొండలు అమెజాన్ నదులు, అటవీ ప్రాంతాలలో ఎక్కువగా మనుగడ సాగిస్తుంటాయి. అయితే దక్షిణ థాయిలాండ్ లోని ఓ నదిలో 20అడుగుల పొడవైన ఓ అనకొండ వీడియో వన్యప్రాణుల అభిమానులను విస్మయానికి గురి చేసింది. పరిశోధకుల బృందం భారీ అనకొండను బోట్ లో దగ్గరగా వీడియో చిత్రీకరణ చేశారు. వీడియోల అనకొండ నీటిలో వెలుతున్న శబ్ధాలు సైతం వినిపించే దగ్గరలో దానిని చిత్రీకరించడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

నది నీటిలో వెలుతున్న అనకొండ అప్పటికే ఏదో జంతువును మింగేసినట్లుగా కనిపిస్తుంది. థాయ్ లాండ్ లో వరదల సమయంలో అడవుల నుంచి ఆహారం కోసం వేట సాగించే క్రమంలో అనకొండలు నదులలో ప్రవేశిస్తుంటాయని నిపుణలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

India’s New Income Tax Bill : ఏప్రిల్ 1 నుంచి సోషల్ మీడియా, ఈ మెయిల్, డిజిటల్ ఖాతాల తనిఖీలు
Revanth Reddy| సభకు రా..చర్చిద్దాం : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్