చేపల వేటలో నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా సిబ్బంది!
నాగార్జున సాగర్ డ్యామ్‌పై భద్రతా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది చేపలు పడుతున్న వీడియో వైరల్ అయింది. భద్రతా నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విధాత : నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది డ్యామ్ పై నుంచి చేపలు పడుతున్న వీడియో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా..ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా విధులను గాలికొదిలేసి..సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ఇలా చేపలు పట్టడంలో నిమగ్నమవ్వడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నాగార్జున సాగర్ డ్యామ్ కు ఉగ్ర ముప్పు పొంచి ఉందని గతంలో హెచ్చరికలు వెలువడ్డాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య సైతం తరుచూ డ్యామ్ నిర్వాహణ హక్కులు, నీటి విడుదల అంశాలపై వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది డ్యామ్ పరిసరాల భద్రతపై నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. అందుకు భిన్నంగా భద్రతా విధులను గాలికి వదిలేసి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తు చేపల వేటలో వారు బిజీ కావడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
సాగర్ ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల దూరం వరకు చేపల వేట నిషేధం ఉంది. అలాంటి నిబంధనల పర్యవేక్షణకు పహారాతో పాటు డ్యామ్ భద్రతాను చూడాల్సిన సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ..స్వయంగా నిషేధం ఉల్లంఘిస్తూ..చేపలు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్‌పై చేపలు పడుతున్న సీఆర్ఫీఎఫ్ సిబ్బంది
విధులు గాలికొదిలేసి.. చేపలు పడుతున్న CRPF సిబ్బంది
ఇప్పటికే సాగర్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు
అయినా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సీఆర్ఫీఎఫ్ సిబ్బంది
సాగర్ ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల దూరం వర… pic.twitter.com/bvN7C622EU
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 25, 2026
ఇవి కూడా చదవండి :
నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటనలో రచ్చ
కవిత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram