Bhadradri Kothagudem | చేపల వేటలో యువకులు పిడుగు పడి దుర్మరణం

చెరువులో చేపలు పడుతున్న ఇద్దరు యువకులపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

Bhadradri Kothagudem | చేపల వేటలో యువకులు పిడుగు పడి దుర్మరణం

విధాత, హైదరాబాద్ : చెరువులో చేపలు పడుతున్న ఇద్దరు యువకులపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దమ్మపేట మండలం జమేదార్ బంజర్‌ గ్రామ చెరువులో ఇద్దరు యవకులు చేపలు పడుతుండగా పిడుగు పడింది. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాచలంలోని చర్ల వద్ద రహదారి పైకి నీరు చేరడంతో రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఈదురు గాలుల కు చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. ప్రధాన రహదారిపై పైకి మూడు అడుగుల మేర వర్షం నీరు చేరడటంతో చర్ల, దుమ్ము గూడెం మండలాల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడే సమసమయ్యంలో చెట్ల కింద ఉండకూడదని, అవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దన్నారు.