Nagarjuna Sagar | రేపు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తివేత.. పూర్తి స్థాయికి చేరువలో నీటి మట్టం

తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం నీటి మట్టం కృష్ణమ్మ పరవళ్లతో పూర్తి స్థాయికి చేరుకుంది

Nagarjuna Sagar | రేపు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తివేత.. పూర్తి స్థాయికి చేరువలో నీటి మట్టం

శ్రీశైలం నుంచి కొనసాగుతున్న వరద ఉదృతి
ఇన్‌ఫ్లో 4,00491, ఔట్‌ ఫ్లో 37,873 క్యూసెక్కులు

విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం నీటి మట్టం కృష్ణమ్మ పరవళ్లతో పూర్తి స్థాయికి చేరుకుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో రేపు (సోమవారం) ఉదయం 8గంటలకు సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జున సాగర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 312టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 270టీఎంసీలకు చేరింది. 590అడుగులకుగాను 575అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 4,00491క్యూసెక్కులు కాగా, ఔట్ ప్లో 37,873క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

దీంతో రోజుకు సగటున 30టీఎంసీల వరద చేరుతున్న క్రమంలో ఏ నిమిషమైన పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశమున్నందునా నేడు ఉదయం 8గంటలకు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు 2లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అదికారిక ప్రకటన విడుదల చేశారు. నాగార్జున సాగర్ దిగువన ఉన్నకృష్ణా నది పరివాహక గ్రామాల, లోతట్టు ప్రాంతాల ప్రజలను, పులిచింతల, విజయవాడ బ్యారేజీ పరిధిలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా నదిలో చేపల వేటకు వెళ్లరాదని జాలర్లకు సూచించారు. ఇప్పటికే సాగర్ ఎడమ కాలువ ద్వారా 4,613క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 5,700క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1200క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్తు కేంద్రం ద్వారా 26040క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.