Telangana | ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్లు.. అధికారులలో గుబులు

ఔత్సాహిక కలెక్టర్లు కొందరు విధి నిర్వాహణలో తమదైన ముద్ర వేస్తూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిసున్నారు. ఈ వరుసలో కామారెడ్డి, నల్లగొండ కలెక్టర్లు ముందున్నారు. మొన్నటి వరకు తరుచు జిల్లా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలు సాగించిన నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి, నిన్న హాలియా ప్రభుత్వాసుపత్రి తనిఖీ చేశారు

Telangana | ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్లు.. అధికారులలో గుబులు

ఇద్దరు అధికారులపై నల్లగొండ కలెక్టర్ వేటు

విధాత: ఔత్సాహిక కలెక్టర్లు కొందరు విధి నిర్వాహణలో తమదైన ముద్ర వేస్తూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిసున్నారు. ఈ వరుసలో కామారెడ్డి, నల్లగొండ కలెక్టర్లు ముందున్నారు. మొన్నటి వరకు తరుచు జిల్లా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలు సాగించిన నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి, నిన్న హాలియా ప్రభుత్వాసుపత్రి తనిఖీ చేశారు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతుల నిర్వాహణను, బోధన సామర్ధ్యాలను పరిశీలించి విద్యార్థులను ప్రశ్నలడిగారు.

శనివారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో తనిఖీ నిర్వహించి మూడు రోజులుగా విధులకు హాజరుకాని పరిపాలన అధికారి అబ్దుల్ మన్నన్ సస్పెండ్ చేశారు. లాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, కనీసం సెలవు సైతం పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని వదిలిపెట్టమని, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని, సమయపాలన పాటించాలని, లేదంటే సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు. రైతు రుణమాఫీపై కార్యాలయానికి వచ్చే రైతులకు సహాయం చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో తక్షణమే రెండు కంప్యూటర్లు, రెండు ఫోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇద్దరు ఆపరేటర్లు, ఇద్దరు సహాయకులు, ఫోన్లు స్వీకరించేందుకు ఇద్దరు, మరో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు ప్రత్యేకించి కాల్స్ నమోదు చేసేందుకు మరో ఇద్దరు మొత్తం ఎనిమిదిని తక్షణమే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. పంట రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కార్యాలయానికి వచ్చిన రైతులను వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లాలని సాకులు చెప్పి పంపించవద్దని హెచ్చరించారు. వెంటనే కంప్యూటర్‌లో లాగిన్ అయ్యి రైతుకు డబ్బు ఎందుకు జమ కాలేదో చెప్పాలని సూచించారు.

రైతు రుణమాఫీ పై జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రీవెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. రుణమాఫీ డబ్బులు జమకాలేదని కార్యాలయానికి వచ్చిన చింతమల్ల సందీప్ కుమార్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రైతు సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ ఏడీ హుస్సేన్ బాబును ఆదేశించారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయానికి వస్తానని చప్పారు. తన ఆకస్మిక పర్యటనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.