Rains | అల్పపీడనం.. తెలంగాణకు వర్షసూచన
Rains |
విధాత: దంచికొడుతున్న ఎండల వేడిమితో తిప్పలు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల మూడునాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని.. రాగల 24గంటల్లో బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించనున్నదని తెలిపింది. అనంతరం 48గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో,ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలుచోట్ల అక్కడక్కడ వానలు పడే అవకాశముందని ఉందని చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ సోమవారం చిరు జల్లులు కురిశాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram